బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్‌.. అదుర్స్‌!

‘రూలర్‌’చిత్రంలో ఐరన్‌ మ్యాన్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టారు నందమూరి బాలకృష్ణ. తన చిత్రాల్లోన్ని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. తాజాగా మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్‌ షేడ్స్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బాలయ్య పాత్రను డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారట బోయపాటి. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ‘ఆఘోర’ క్యారెక్టర్‌లో బాలయ్య కనిపించనున్నాడని టాలీవుడ్‌ టాక్‌.