తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఆరోగ్యం, రుణ సహాయం, సంక్షేమ పథకాల అమలు, ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ, భోజన సౌకర్యం, పన్ను తగ్గింపులు, బకాయిల చెల్లింపులకు ఈ నిధిని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రూ. 10కే కిలో బియ్యం(దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు కాకుండా) పంపిణీ.. అదే విధంగా రెండు నెలల పెన్షన్ ముందుగానే ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా గురువారం కేరళలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.(తెలంగాణ సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులు : కేసీఆర్)
కరోనా: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం