అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 34 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు 14 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9 మంది మృతి చెందారు. ఇక ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 450కి చేరింది. ఇక గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఇప్పటి వరకు గుంటూరులో 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 91, నెల్లూరులో 56, ప్రకాశంలో 42, కృష్ణా 44, వైఎస్సార్ జిల్లాలో 31, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో మరో 34 కరోనా కేసులు